Monday, 14 September 2026 08:23:20 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ప్రారంభమైన ఇన్నో ట్రైబ్

అధ్యాపకుల భోదనా విధానం లో మెలుకువలు పై ఇంటరాక్షన్ కార్యక్రమం

Date : 25 May 2026 06:27 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని అధ్యాపకుల కోసం “ఇన్నో ట్రైబ్ ప్రారంభం” అనే అంశంపై ప్రత్యేక అవగాహన మరియు ఇంటరాక్టివ్ లెక్చర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంస్థ నుండి విజయవంత్ మాథూర్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిల్వియా పి – ప్రోగ్రామ్ అసోసియేట్, పి. వినోద్ కుమార్ – ప్రోగ్రామ్ అసోసియేట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవంత్ మాథూర్ మాట్లాడుతూ యువతలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమని, విద్యాసంస్థల్లో ఇన్నోవేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. “ఇన్నో ట్రైబ్” కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లభించే అవకాశాలు, స్టార్టప్‌లకు అందించే మద్దతు పథకాలు, ఇంక్యూబేషన్ కేంద్రాల సహకారం వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే విద్యాసంస్థలు మరియు ఇన్నోవేషన్ హబ్‌ల మధ్య పరస్పర సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిట్స్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చేపడుతున్న ఇన్నోవేషన్, స్టార్టప్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మరియు ఇంక్యూబేషన్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఏం. బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ అనంతరామన్, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :