Saturday, 12 September 2026 04:30:53 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

పుంగనూరు లో ఆగస్ట్ 20వ తేదీ న ‘జాబ్ మేళా'

జాబ్ మేళా - 2026 పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

Date : 10 August 2026 03:33 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పుంగనూరులోని MCV డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన ‘జాబ్ మేళా–2026’ నిర్వహించనున్న సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 10కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులకు వేదిక వద్దే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్ ఎస్ సి, ఐటిఐ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగిన ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు

*జాబ్ మేళా వివరాలు:* తేదీ: 20 ఆగస్టు 2026 వేదిక: MCV డిగ్రీ కళాశాల, పుంగనూరు, అన్నమయ్య జిల్లా ఉద్యోగ ఖాళీలు: 500+ పాల్గొనే కంపెనీలు: 10+ అర్హతలు: ఎస్ ఎస్ సి / ఐటిఐ / డిప్లొమా / గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశం: ఉచితం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశు , జిల్లా ఉపాధి అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ( డి.ఎస్.డి.ఓ ) తదితర అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో జాబ్ మేళాకు హాజరై, తమ విద్యార్హతలు మరియు నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను పొందాలని APSSDC జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. శ్యామ్ మోహన్ తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :