Saturday, 12 September 2026 05:24:24 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట - వాటర్ మ్యాన్ కాదు - క్రెడిట్ చోరీ మ్యాన్

- వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు

Date : 05 September 2026 09:21 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట - వాటర్ మ్యాన్ కాదు - క్రెడిట్ చోరీ మ్యాన్ - వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు మదనపల్లె : పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వైసిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం కంటే,ఇతరులు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయడమే బాగా తెలుసన్నారు.వెలిగొండకు 1996లో శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లలో కేవలం రూ.10 లక్షలు ఖర్చు చేసిన చంద్రబాబు,ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు తన ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.వెలి గొండకు రూ.3,581.58 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చి,అసలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ అని గుర్తు చేశారు.వైఎస్సార్ హయాంలోనే 20.333 కి.మీ సొరంగం పూర్తయితే,వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన 10.568 కి.మీ సొరంగాన్ని పూర్తిచేసి రెండు టన్నెల్స్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు.పోలవరం ఎడమ కాలువలో దాదాపు 79 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని,అదే కాలువలో నీళ్లు వదిలి మొత్తం ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం క్రెడిట్ చోరీ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.సీఈఓ సీఎం నుంచి వాటర్ మాన్ అంటూ ఇంగ్లీష్ మీడియాలో డబ్బులిచ్చి ప్రచారం చేయించుకున్నంత మాత్రాన చరిత్ర మారదని,రికార్డుల్లో ఎవరు ఎంత పనిచేశారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.పోలవరం ఎత్తు,నిర్వాసితుల పునరావాసం,ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి తేదీపై చంద్రబాబు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రఘునాథ రెడ్డి,కార్యదర్శి వి.ఎస్ రెడ్డి,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున,యూనస్,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: