Wednesday, 29 July 2026 11:01:46 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు - జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

దొమ్మేటి వెంకటరెడ్డి కి ఘనంగా నివాళులు

Date : 23 March 2026 09:32 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారి ఆదేశాల మేరకు నేడు మదనపల్లె లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ సంఘ సంస్కర్త, దాత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు వెంకటరెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పగుచ్చాలతో ఘన నివాళులర్పించారు

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి గారు కేవలం ఒక ప్రాంతానికో, కులానికో పరిమితమైన వారు కాదు. ఆయన సామాజిక సమానత్వం కోసం, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా బర్మాలో వ్యాపారవేత్తగా ఎదిగి, అక్కడ మేయర్‌గా సేవలందించి *'బర్మా కేసరి'* గా ఖ్యాతి గడించడం గర్వకారణం. విద్య కోసం తన ఆస్తులను, భూములను దానం చేసిన ఆయన గొప్ప మనసు నేటి తరానికి స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు. గాంధీజీ కంటే ముందే కుల నిర్మూలన, వయోజన విద్య వంటి అంశాలపై పోరాడిన ధీశాలి వెంకటరెడ్డి గారని, వారి ఆశయాలను స్మరించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి శంకరమల్లయ్య, ఆర్ఎస్ టిఎఫ్ ఇన్స్పెక్టర్ ఏ. మోహన్ కుమార్, పలువురు ఎస్ఐ లు ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు హోంగార్డులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన సేవలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: