నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 24 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారి పల్లె కు చెందిన యువతి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో హత్యకు గురైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివారాల మేరకు చొక్కాండ్లపల్లె గ్రామపంచాయతీ భిక్కింవారి పల్లెకు చెందిన రెడ్డెప్ప రెండవ కుమార్తె దేవిశ్రీ 21 పై చదువులు కోసం కర్ణాటక బెంగళూరులోని ఓ ప్రవేట్ కాలేజీలో బిబిఎం చదువుతూ పెయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రి గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ్ వర్ధన్ ఆదివారం బెంగళూరు వెళ్లి దేవిశ్రీ స్నేహితురాలు రూముకు దేవిశ్రీ ని పిలిపించుకున్నాడు. వీరి ఇద్దరినీ రూములో వదిలి స్నేహితురాలు వెళ్ళిపోయింది. దేవిశ్రీ , ప్రేమ్ వర్ధన్ మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని ప్రేమ్ వర్ధన్ దేవిశ్రీ ముఖముపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి దేవిశ్రీ నీ చంపేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న దేవిశ్రీ కుటుంబసభ్యులు బెంగళూరు వెళ్లి అక్కడి పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదుచేయించారు. దేవిశ్రీ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. జీవనోపాది కోసం పై చదువులకు వెళ్లిన కూతురు జీవక్షవంలా తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలం కర్ణాటక కావడంతో ఏ పి హోం మంత్రి చొరవ తీసుకొని తన కూతురుకు పట్టిన గతి వేరొకరికి పట్టకుండా నిందితున్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని దేవిశ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు
Reporter
Namitha News