నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 11 : జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలు అవగాహన పొంది అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులలో విజ్ఞానజ్యోతి వెలిగించాలని ఎంఈఓ త్యాగరాజు ఆకాంక్షించారు. మంగళవారం జడ్పీ హైస్కూల్లో జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై అంగన్వాడీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ తో పాటు హెడ్మాస్టర్ శ్రీనివాసులు, కె ఆర్ పి గురునాథం, సూపర్వైజర్లు రమణమ్మ, భారతి లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈనెల 11, 12, 13 తేదీలలో జరిగే శిక్షణ తరగతులలో ఐదు డొమెన్స్ పైన ఆదర్శశిల, నవ చేతన తో పాటు ప్రీస్కూల్ యాక్టివిటీ, కమ్యూనిటీ కార్యక్రమాలపై అవగాహన పొందాలని సూచించారు. డి ఆర్ పి లు సుధాకర్, రమణ నాయక్, వెంకట నరసప్పలు అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై డిజిటల్ రూపంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో అంగన్వాడి సూపర్వైజర్ భారతి, మండలంలోని అంగన్వాడీలు పాల్గొన్నారు
Reporter
Namitha News