Wednesday, 29 July 2026 11:01:58 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జీవన ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు

Date : 19 December 2025 02:46 PM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 19 : పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో రైతు హరినాథ్ రెడ్డి పొలంలో శుక్రవారం జీవన ఎరువుల వినియోగాలపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జీవన ఎరువులు వినియోగించిన పంటను ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. జీవన ఎరువుల వాడకంతో మొక్కలు వేగంగా ఎదిగి, ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా ఉన్నాయని రైతులు తెలిపారు. రసాయన ఎరువులతో పోలిస్తే జీవన ఎరువులు పంటకు మేలు చేస్తాయని, నేల సారవంతం పెరుగుతుందని రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా కాలీఫ్లవర్ సాగులో జీవన ఎరువులు వాడటం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుందని రైతులు వెల్లడించారు. ఈ రైతు అవగాహన సదస్సు బయోఫ్యాక్టర్ ఆర్ఎం గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. బయోఫ్యాక్టర్ ప్రతినిధులు జీవన ఎరువుల ప్రయోజనాలు, వినియోగ విధానాన్ని రైతులకు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బయోఫ్యాక్టర్ ఆర్ఎం గంగాధర్ నాయుడు, ఇన్‌టి సుదర్శన్ నాయుడు, ఎస్.బి. ఉదయ్‌ కుమార్, తదితర రైతులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :