నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఫిబ్రవరి 25 : రామసముద్రం మండలం లోని చెంబకూరు పంచాయతిలో వెలసిన శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి తిరుణాల వేడుకలను ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని ఆలయ అర్చకులు , గ్రామ పెద్దలు, కార్య నిర్వాహకులు తెలిపారు. 27న అంకురార్పణ, 28న ధ్వజారోహణం, రాత్రి సూర్య ప్రభోత్సవం, 1న సింహవాహనం , 2 శేష వాహనం -3 హనుమంత వాహనం, 4న గజ వాహనం 5న కల్యాణోత్సవం - గరుడోత్సవం, 6 రథోత్సవం ,7న దోపోత్సవం , 8 వసంతోత్సవం, ధ్వజా ఆరోహణ , 9 పుష్ప పల్లకి సేవ 10 న శయనోత్సవం 11న సుప్రభాత సేవ జరగనున్నట్లు తెలిపారు. భక్తాదులు స్వామివారి సేవలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు
Admin
Namitha News