నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - సెప్టెంబర్ 15 : తంబళ్లపల్లె క్రాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్లోని వినాయక మండపం వద్ద విద్యుత్ శాఖ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ కుటుంబ సభ్యులు నిరుపేదలకు, భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ దంపతులు వినాయకుడి గ్రహానికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, విద్యుత్ శాఖ ఉద్యోగులు, రైతులు, వినియోగదారులు శంకర్ కుటుంబ సభ్యులను అభినందించారు
Reporter
Namitha News