నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం జిమాక్స్ -2కే26 (GMOCS-2K26) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమెల్డా బానుమతి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ – లెర్నింగ్ & డెవలప్మెంట్, మొవేట్, చెన్నై పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పరిశ్రమలో విజయం సాధించాలంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ కూడా అత్యంత అవసరమని అన్నారు. నూతన టెక్నాలజీ పై ఆవిష్కారణలు చేయాలనీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు చిన్న చిన్న సంస్థలు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీ లో మెరుగైన పరిశోధనలతో నూతన ఆవిష్కరణలను చేస్తున్నాయని విద్యార్థులు వాటి పై ద్రుష్టి పెట్టాలని అన్నారు. జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే, నైతిక విలువలతో కూడిన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న వేగవంతమైన పురోగతి వెనుక సాంకేతికతలో ఆవిష్కరణలు, పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మొదలైనవి సాంకేతిక ఆవిష్కరణ పురోగతికి మూలస్తంభంగా చెప్పుకోవచ్చు అని అన్నారు. సాంకేతిక ఆవిష్కరణ అనేది సామర్థ్యాన్ని పెంచి, సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త అవకాశాలను సృష్టించేదని అన్నారు. సంచలనాత్మక ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఉన్న సాధనాలు, సిస్టమ్‌లు మరియు ప్రక్రియలకు పెరుగుతున్న మెరుగుదలలను టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రభావితం చేస్తాయని అన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహనపెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రసంశ పాత్రలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్–స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్ శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ డి జె ఆష్పిం పబి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News