నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : మదనపల్లి పట్టణం గంగారపు లేఔట్, మోతి నగర్, బెంగళూరు బస్టాండ్, సంత గేటు, ప్రశాంత్ నగర్, నీరుగుట్టువారిపల్లి, అనప గుట్ట మరియు టీచర్స్ కాలనీ నందు దాదాపు రెండున్నర కోటి రూపాయలతో సీసీ రోడ్లు మరియు కోటి రూపాయలతో డ్రైనేజీ కాలువలు నిర్మాణం కొరకు భూమి పూజలు చేసిన షాజహాన్ బాషా ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్నడూ ఎవరూ చేయలేని అభివృద్ధి ఈ రోజు పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేస్తున్నానని, అభివృద్ధి కి మారుపేరు గా పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అని తెలియచేసారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ప్రమీల, మునిసిపల్ సిబ్బంది, స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News