నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లి: నమిత న్యూస్ అక్టోబర్ 21 : రాష్ట్రంలో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను నియమించినది . గ్రామ సచివాలయ వ్యవస్థ పైన సరియైన పర్యవేక్షణ నియంత్రణ లేక గ్రామాల్లో సచివాలయం ఉద్యోగుల పనితీరు పై పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా తయారయింది. ఈ రోజు అన్నమయ్య జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచులు సచివాలయ వ్యవస్థలపై సర్పంచులకు పూర్తి అధికారం ఇవ్వాలని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్లు అందించారు. గత మూడు సంవత్సరాల నుంచి సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలకు రావాల్సిన ఆర్థిక నిధులు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీ రాష్ట్ర కమిటీ సర్పంచ్ల వ్యవస్థాపక అధ్యక్షులు వైవి బి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రం సమర్పించిననామని పోరాటాలు, ఉద్యమాలు, చేసిన ఫలితం లేదని ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ సర్పంచులకు ఇస్తామన్న హామీలు నెలకు పదివేల రూపాయలు పారితోసిము, మాజీ సర్పంచ్లు లకు జీవితకాల పెన్షన్లు అందించాలని, జిల్లా కలెక్టర్లు ద్వారా గ్రామపంచాయతీ సచివాలయంలో అజమాయసి పనితీరు మెరుగుపడాలని, అవసరమున్న మేరకు సచివాలయ సిబ్బందిని ఉంచి సచివాలయ సిబ్బందిని గ్రామపంచాయతీకి అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ తో కూడిన వినతీ పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోనంపేట సర్పంచ్ మోతుకూరు లక్ష్మీనారాయణ, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గ నిర్వహణ కార్యదర్శి పూలు కుంట సర్పంచ్ పూలుకుంట పార్థసారథి రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెమ్మాడపల్లి సర్పంచ్ పల్లపు వాసు, ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు మట్టి సర్పంచ్ సోమారపు నాగార్జునచారి, మద్దిరేవుల సర్పంచ్ తుమ్మల చంద్రమ్మ , కాకులారం సర్పంచ్ మల్ రె డ్డి ,దప్పేపల్లి సర్పంచ్ కేశవయ్య, లక్కిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ చoడ్రయుడు, కుర్నూతల సర్పంచ్ వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, బి ఎర్రగుడి సర్పంచ్ రెడ్డయ్య, పాలెం గొల్లపల్లి మాజీ సర్పంచ్ రామచంద్ర, తదితర సర్పంచులు పాల్గొన్నారు.
Reporter
Namitha News