Monday, 14 September 2026 09:15:50 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ అండ్ ఏ ఐ సెక్యూరిటీ కార్యక్రమం

Date : 09 March 2026 06:01 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 09 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ మరియు మిట్స్ ఐఈఈఈ సహకారంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ అండ్ ఏ ఐ సెక్యూరిటీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చెన్నైలోని ఆర్ ఏం కే ఇంజనీరింగ్ అటానమస్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి పాల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిధి డాక్టర్ డి పాల్ రాజ్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ డి పాల్ రాజ్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యురిటీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత యంత్రాలు, అల్గోరిథములు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ళ ద్వారా సైబర్‌ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని అన్నారు నెట్‌వర్క్‌లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అన్నారు. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని. ఏ.ఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్‌గా మార్పులు చెందే మాల్వేర్, సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు . అందువల్ల AI ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు మరియు సైబర్‌ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్‌ భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుంది అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా యువ పరిశోధకులకు నూతన ఆలోచనలు, పరిశోధన అవకాశాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలుసుకుని తమ తాజా పరిశోధనలను పంచుకోవడం, సైబర్ ముప్పుల గురించి అవగాహన పెంచుకోవడం మరియు ఏ.ఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు. దేశ విదేశాల నుంచి 170 మంది పరిశోధకులు మరియు విద్యార్థులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సదస్సులో భోపాల్ లోని ఎన్ ఐ టి టి టి ఆర్ (NITTTR) విద్య సంస్థ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గణపతి మరియు ఒమన్ దేశం, మస్కట్ లోని యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ గుణశేఖరన్ తంగవేల్ లు వర్చ్యువల్ పద్దతిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెర్సిస్ అర్బన, కన్వీనర్ డాక్టర్ కే.పి మణికంధన్, కోఆర్డినేటర్స్ టి నిరంజన్, ఎమ్.ముత్తురాసు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: