Monday, 14 September 2026 11:38:58 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Date : 28 May 2026 02:02 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,* గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ వి.జె. రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. వెండితెరపై పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి అద్భుత విజయాలు సాధించిన ఆయన, రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి సామాన్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ దార్శనికత, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు, సమాజ శ్రేయస్సుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఎంటిఓ) కె. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ ఎం. చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది మరియు హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అంజలి ఘటించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: