Sunday, 13 September 2026 09:57:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ లో ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ పై వర్కుషాప్

Date : 12 March 2026 05:16 PM Views : 347

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 12 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గుంటూరు లోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సజ్జ తులసి క్రిష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్‌లో ఫ్రంట్‌ఎండ్ యూజర్ చూసే భాగం మరియు బ్యాక్‌ఎండ్ లో డేటాబేస్, సర్వర్, లాజిక్ వంటి రంగాలలోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్ రెండింటినీ నిర్వహించగలగడం వల్ల టీమ్‌పై ఆధారపడటం తగ్గి, ప్రాజెక్ట్ నిర్వహణ వేగంగా పెరుగుతోందని అన్నారు. విద్యార్థులకు ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ అవగాహన ఉండటం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, యూజర్‌కు ఎలా కనిపిస్తుంది అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్ట్‌ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, ఒక్కరే ఒక టీమ్‌లా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఐటి రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్ కె.మొహమ్మద్, డాక్టర్ చొక్కనాథన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :