నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభివృద్ధి, సంక్షేమానికి నాంది పలికిన మొదటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి... ఉచిత విద్యుత్, రుణ మాఫీ చేసి రైతాంగానికి ఊతమిచ్చిన రైతు పక్షపాతి... తండ్రి చూపిన బాటలో సంక్షేమ పధకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి -- కొనియాడిన మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ -- మదనపల్లెలో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు అభివృద్ధి, సంక్షేమం, రైతుల చేయూత ఇచ్చిన ముఖ్యమంత్రులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి వారని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి వేడుకలు మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో తట్టివారిపల్లి వైయస్సార్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధులుగా హజరైనారు. దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ సందర్భంగా సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత, వైఎస్. రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని అన్నారు. రైతు లేనిదే దేశం లేదని, రైతాంగం సంక్షేమానికి మొదటి అడుగు వేసి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి చారిత్రాత్మక పథకాలను అమలు చేసి వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోశారని తెలియజేశారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల కోసం ఇందిరమ్మ గృహాలు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించి మహానేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచ చరిత్ర వున్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు ఆయన ఆశయాలు, ఆలోచనలు, సంక్షేమ పధకాలు కొనసాగించటానికి అయన వారసుడుగా వైయస్సార్ సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలుస్తారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన ప్రజాసేవా మార్గంలో పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతూ ఐదేళ్ళ సంక్షేమ, సూపరిపాలన అందించారని గుర్తు చేశారు. రెండేళ్ళకే కూటమి పాలనపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని ప్రజలు బలమైన ఆకాంక్షతో వున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పధకాలు మళ్లీ ప్రజల ధరికి చేరాలంటే జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని, అందుకు మనమంతా కష్టపడి జగన్మోహన్ చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, వైస్ ఛైర్మన్ జింకా చలపతి, ఎస్ఈసి మెంబర్ షమీమ్ అస్లాం, వైఎస్ఆర్ సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, యుజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, నాయకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి, వేమారెడ్డి, మాధవ రెడ్డి, రాజేంద్ర నాయుడు, శీలం రమేశ్ , ఆవుల మల్లికార్జున, బీరంగి రేవతి, వినూత బాయి, చరణ్, సోమశేఖర్ రెడ్డి, సాంబశివారెడ్డి, ఈశ్వరయ్య, యాసిన్, మహేశ్, ప్రసాద్‌బాబు, శ్రీనివాసులు, పాల్ చంద్రశేఖర్, ఎన్.ఇర్ఫాన్, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, మధు, రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శి ఎస్.కె ఇర్ఫాన్, కొత్తపల్లి మహేశ్, శంకర్ నాయక్, శారదారెడ్డి, నాగమణి, మంజుల, లియాఖత్ అలీ ఖాన్, హరినాయక్, యూనస్ , గుండ్లూరు రఫీ, బిఏ.ఖాజా, మొహియుద్దీన్ ఖాన్, షానవాజ్, ఎన్ నవాజ్, అబ్దుల్లా, శరత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొత్తపల్లి నాగార్జున నాయుడు, బయ్యారెడ్డి, నాగరాజ రెడ్డి, పారేసి, ఈశ్వరయ్య, చెన్నకృష్ణ, అంకిశెట్టిపల్లి రమణ, మాలెపాడు చలపతి, బుడ్డయ్య, వడిగల శ్రీకాంత్, బాలాజీ నాయక్, భాస్కర్, పవన్ తేజ, షేక్ జబి, తాజ్ భాషా, మహమ్మద్ ఖాన్, జివి. ప్రసాద్, ఎం.ఫిర్దౌస్ ఖాన్, మజ్జిగ కేశవ యాదవ్, నయాబ్ ఫిరోజ్, పవన్ రాయల్, ఖాదర్, ఆవుల విశ్వనాథ్, చీకలబైలు చంద్ర, సత్తార్, తాళే సుబ్రహ్మణ్యం, జబి, సమద్ వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News