Monday, 14 September 2026 10:11:29 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మల్లయ్యకొండ మైనింగ్ కి వ్యతిరేకంగా బీసీవై పార్టీ ఉద్యమం.

జూలై 08వ తేదీ న సోమవారం చలో మల్లయ్యకొండ ను విజయవంతం చేయండి

Date : 28 June 2026 09:10 PM Views : 397

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 28 : అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో లక్షలాది మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా, స్థానిక ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అక్రమంగా తలపెట్టదలచిన మైనింగ్ కి వ్యతిరేకంగా ఉద్యమానికి బీసీవై పార్టీ సిద్ధం. రాయలసీమ జిల్లాలో శ్రీశైలం శ్రీకాళహస్తి తర్వాత అంత విశిష్టంగా పేరుందిన మల్లయ్య కొండ శైవ క్షేత్రం జోలికి వస్తే మాడి మసైపోతారు. ఐరన్ ఓర్ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండ లో గుణపం దింపితే ఆ శివయ్య చూస్తూ ఊరుకోడు. సాదుకొండ ఇనుముకొండ మల్లయ్య కొండ సముదాయంగా ఉన్న మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ వెలికితీయడానికి TDP ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే బీసీవైపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుంది. 08-07-2026 (సోమవారం) .శివ భక్తులతో కలిసి బీసీవై పార్టీ మల్లయ్య కొండ పరిరక్షణకు నడుము బిగించనుంది. 6, 700 హెక్టారలో విస్తరించి ఉన్న మల్లయ్య కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటికే సాదుకొండ చిన్నరకొండ ప్రాంతాలలో 1550 హెక్టార్లలో కూటమి ప్రభుత్వం మైనింగ్ కోసం ఏపీ కన్జాభివృద్ధి సంస్థకు ఇచ్చిన లైసెన్స్ ను వెనక్కు తీసుకొని ముక్కంటికి క్షమాపణలు కోరకపోతే బిసివైపి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతోంది. నాడు మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పిన చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి గా మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు పచ్చ జెండా ఊపడం విస్తు గొలుపుతోంది. మరోవైపు సనాతన ధర్మం హిందూ ధర్మం అని ప్రతి రోజు ఊదరగొట్టే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు కొండల్లో కొలువై ఉన్న ముక్కంటికి కీడు తల పెడుతుంటే ఆయన మౌనం పాటిస్తుండడం దేనికి సంకేతమో ఆయనే సెలవివ్వాలి .ఈ అరాచకాలను ఆ మల్లయ్య కొండపై కొలువుదీరిన శివయ్య ఆశీర్వాదంతో బీసీవైపి అడ్డుకోవడానికి ముందుకు వస్తోంది

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: