నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 : తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం తిరుపతి రమాదేవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా హాస్పిటల్ కు చెందిన వైద్య బృందం సుమారు 100 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,వక్తలు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి సహకరించిన తిరుపతికి చెందిన జర్నలిస్ట్ చంద్రశేఖర్ ను రమాదేవి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలతో మారుమూల గ్రామాలలో నిరుపేదలకు వైద్యం అందించడం హర్షినీయమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులు,వాలంటీర్లు, టిడిపి, కూటమి నాయకులు, ప్రజలకు రమాదేవి హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News