Sunday, 13 September 2026 04:29:59 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మొద్దు - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కంట్రోల్ రూములు ఏర్పటు

Date : 21 March 2026 05:16 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 21: అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్‌ లోని పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లాలో పనిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు తో గ్యాస్ సిలిండర్ల సరఫరా, నిల్వలు, డెలివరీ విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న కొన్ని అపోహలకు ఎలాంటి వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శివ నారాయణ్ శర్మ, ఐఏఎస్ తెలిపారు. జిల్లాలో గల 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు మరియు సంబంధిత డివిజనల్ స్థాయి అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ స్పందన అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు

కంట్రోల్ రూములు, టీమ్ వివరాలు: జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని నెంబరు 08571-293001 ద్వారా గ్యాస్ సమస్యలు మరియు ఫిర్యాదుల పరిష్కారం కొరకు జిల్లా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు. మదనపల్లి డివిజన్ : సి . సుబ్బయ్య, సి ఎస్ డి టి 9705302401 వి. నాగేశ్వరరావు, ఎస్ ఐ 9440796741 డి. వెంకటేష్, HC 9059288299 రాయచోటి డివిజన్: కె. వెంకటరెడ్డి రెడ్డి, సి ఎస్ డి టి 8500379887 మహమ్మద్ అబ్దుల్ జహీర్, si 9121100561 వి. రామరాజు, PC 6303176529 పీలేరు డివిజన్: కె. విజయ్ కుమార్, CSDT 8522881068 ఎస్. రహీమ్, SI 9573317367 మోహన్ రాజు, HC 9030453371 ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలపై ఫోన్ నెంబర్లను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో తరచుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడం అవసరం లేదని, గ్యాస్ కొరత వస్తుందని అపోహతో వరుసగా ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని తెలిపారు.పట్టణ వినియోగదారులు 25 రోజులు, గ్రామీణ వినియోగదారులు 45 రోజుల గడువులో మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే బుకింగ్ చేసిన తర్వాత ఒకటి నుండి మూడు రోజులలో ఓటీపీ వస్తుందని, ఆ ఓటిపి వచ్చిన తర్వాత మాత్రమే గ్యాస్ సరఫరా జరుగుతుందని తెలిపారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు మరియు ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.గృహ వినియోగ సిలిండర్లు (14.21 కిలోలు) వాణిజ్య అవసరాలకు వినియోగించినట్లయితే, నిత్యావసరాల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం గ్యాస్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని, ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కోరారు. సంక్షేమ సంస్థలకు ప్రాధాన్యత : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల కు గ్యాస్ కొరత లేకుండా అవసరమైన సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యతతో అందించాల్సిందిగా గ్యాస్ ఏజెన్సీలు, అధికారులను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో డీఎస్ఓ సుమతి, తూనికల & కొలతల అధికారి దివ్య, సి ఎస్ డి టి లు, ఆర్ ఐ బాలాజీ, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :