Thursday, 30 July 2026 06:46:37 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 12 June 2026 08:20 PM Views : 98

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 12 : రోజురోజుకూ భగభగమంటున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్లపై నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, శుక్రవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు వేసవి రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా ఒక్కో సిబ్బందికి సూర్యుని ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడే *గాగుల్స్, తెల్లటి టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లతో పాటు రెండు జతల ట్రాఫిక్ యూనిఫామ్‌లను* ఎస్పీ గారు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు సిబ్బంది యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు, మదనపల్లె పట్టణంలోని వివిధ రద్దీ కూడళ్లలో వారు నిర్వర్తిస్తున్న విధులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ.. "తీవ్రమైన ఎండల్లోనూ ప్రజల భద్రత, సుగమమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం మీరు పడుతున్న శ్రమ అభినందనీయం. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో, మీ ఆరోగ్య రక్షణ కూడా అంతే ముఖ్యం. ఎండ తీవ్రతను తట్టుకునేలా విధుల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి" అని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ట్రాఫిక్ సీఐ గురునాథ్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రవి, ట్రాఫిక్ మహిళా ఎస్ఐలు గాయత్రి, శివకామిణి, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ తదితర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :