Monday, 14 September 2026 09:51:44 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మౌంటేన్ అడ్వన్చర్ క్యాంప్ లో ప్రతిభ కనబర్చిన మిట్స్ ఎన్.సి.సి. విద్యార్థులు

Date : 08 May 2026 09:05 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని యెన్.సి.సి క్యాడెట్లు గంగరపు జ్యోతీశ్వర్, రామిరెడ్డి లక్ష్మణ్ మరియు ఎమ్ భార్గవి లు భారతీయ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో-టూరిజం నిర్వహించిన నేషనల్ లెవెల్ అడ్వెంచర్ మరియు మౌంటెనీరింగ్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. సిక్కింలోని చెమ్చేలో ఉన్న ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో-టూరిజం (IHCAE) ఉన్నత స్థాయి పర్వతారోహణ శిక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ అని ఆయన అన్నారు. ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (IMF) గుర్తింపు పొందిన ఈ కేంద్రం పర్వతారోహణ, రాక్ క్రాఫ్ట్ మరియు ఐస్ క్రాఫ్ట్ వంటి రంగాలలో అత్యుత్తమ శిక్షణను అందిస్తోందని తెలిపారు. ఈ శిక్షణలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలనుండి 15 మంది క్యాడెట్స్ పాల్గొనగా, అందులో మిట్స్ విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. సుమారు 6,582 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ ప్రాంతాలలో ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి సాహస కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ శారీరక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకున్నారని అన్నారు . అదేవిధంగా పర్వతారోహణ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి కఠిన శిక్షణల ద్వారా ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ జట్టు భావనతో పని చేయడం, దేశ సేవకు సిద్ధమవడం వంటి విలువలు పెంపొందుతాయని అన్నారు . ప్రతి క్యాడెట్ కూడా తమ వంతు దేశ రక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం యెన్.సి.సి క్యాడెట్స్ తమ యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని, జాతీయ స్థాయి వేదికలపై ఇటువంటి శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, సాహస స్ఫూర్తి మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో మిట్స్ యూనివర్సిటీ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి క్యాంప్ కోర్స్ డైరెక్టర్ కాజీ షెర్పా మరియు ట్రైనింగ్ ఆఫీసర్ నకుల్ గిరి పర్యవేక్షణ వహించినట్లు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన యెన్ సి సి విద్యార్థులు యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తదితరులు అభినందనలు తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :