Thursday, 30 July 2026 05:31:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

నూతన టెక్నాలజీ తో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలతో భూ సమస్యలకు చెక్ - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 02 January 2026 07:57 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 02 : తంబళ్లపల్లె మండలం లో రైతుల భూముల సమస్యల ప్రక్షాలనతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేని నూతన పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్నె మడుగు సచివాలయంలో నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే లో పలు రకాల భూ సమస్యలు వచ్చాయని వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సైతం భూములకు సంబంధించి అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, పొలాల వద్ద వచ్చే సమస్యలు తమ దృష్టికి తెస్తే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సహకారంతో పరిష్కారం చేస్తానని హామీఇచ్చారు. నూతన పాస్ బుక్కులు ద్వారా రైతుకు రైతు భరోసా,రుణాలు, సబ్సిడీ పథకాలు తోబాటు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర,తెలుగు సోమశేఖర్,బాలరాజు, యువత యువ నేత బాబు ,సిద్ధారెడ్డి,పురుషోత్తం, వీరాంజనేయులు, నరసింహులు,భూమిరెడ్డి,బిజెపి రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, వీఆర్ఏలు నాగేశ్వర, మల్లి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :