Monday, 14 September 2026 10:58:02 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పట్టాదారు పాస్ పుస్తకం లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

వెంకటరాజు గారి పల్లె లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Date : 06 February 2026 08:12 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లి - ఫిబ్రవరి 06 : పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూ యజమాని మరియు భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతల గ్రామం వెంకట్ రాజు గారి పల్లెలో నిర్వహించబడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు

రెవెన్యూ గ్రామ సభ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కలిగిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను మరియు వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. ఈ అధునాతన సాంకేతికతతో సెంటీమీటర్ కూడా తేడా జరగకుండా రి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది తదితర అంశాలను చాలా స్పష్టంగా మరియు సులభంగా గుర్తించగలుగుతామన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పలువురు లబ్ధిదారులతో పట్టాదారు పాసుపుస్తకం లో సరైన వివరాలు నమోదు చేసి ఉన్నారా లేక ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ నెంబరు సరిగా ఉందా వంటి పలు ప్రశ్నలను అడగగా సరైన వివరాలను చేర్చి ఉన్నారని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తాసిల్దారును ఆదేశించారు

మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రిసర్వే పూర్తయిన గ్రామాలలో ప్రజల కోసం నిర్వహిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై పాసుపుస్తకాలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు కూలంకషంగా వివరించారు. ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు మరియు ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే అర్జీ పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :