Wednesday, 29 July 2026 03:23:12 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

వడదెబ్బకు ఉపాధి హామీ దళిత కూలి అకాల మరణం

ఆశ్రయం కోల్పోయిన కుటుంబం

Date : 18 May 2026 07:57 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 ః ఉపాధి హామీ పనులతో జీవనం సాగించే ఓ దళిత కూలి వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడిన విషాదకర సంఘటన గోపి దిన్నె పంచాయతీలో వెలుగు చూసింది. మండలంలోని గోపి దీన్నే పంచాయితీ దళిత వాడకు చెందిన అలిగింటి శ్రీనివాసులు (45)ది నిరుపేద కుటుంబం. ఉపాధి హామీ కరువు పనులకు వెళ్లి తన భార్య గౌరమ్మ తో పాటు ముగ్గురు సంతానాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఉపాధి పనికి వెళ్లే శ్రీనివాసులు సోమవారం సైతం ఉపాధి పనులకు వెళ్ళాడు. అక్కడ పనిచేస్తుండగా హఠాత్తుగా వడదెబ్బ తగిలి అపస్మార్క స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన సహచర కూలీలు సపర్యలు చేసి చికిత్సలకు తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే శ్రీనివాసులు మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇక మమ్మలను ఆదుకునే దిక్కెవరిని కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసుల కాయ కష్టంతో జీవనం సాగించే ఆ కుటుంబం నేడు ఆశ్రయం కోల్పోయి బజారున పడిందని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సర్వత్ర కోరుతున్నారు. శ్రీనివాసులు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో కార్యకర్త గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసుల కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :