నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 08 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా క్రై సంస్థ సారధ్యంలో బాలికలు, మహిళల సాధికారితపై చేసిన కృషికి పోర్డు సంస్థ సభ్యులు కె.రెడ్డమ్మ,జి.అనితలకు క్రై సౌత్ రీజినల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్ రాష్ట్రస్థాయి ప్రతిభ అవార్డులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో స్టెమ్ ఫర్ ఎవరీ గర్ల్ కార్యక్రమంలో జాన్ రాబర్ట్ మాట్లాడుతూ(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో విద్యావృత్తులు కొనసాగిస్తున్న బాలికల ఆశయాలను విశదీకరించారు. తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల లో అణగారిన వర్గాల సమాజాల నుండి వచ్చిన బాలికలు తమ సామాజిక, ఆర్థిక,సాంప్రదాయ అడ్డంకులను అధిగమించి స్టెమ్ రంగాల్లో విద్యావృత్తులను సాధించుకునేందుకు చేసిన ప్రయాణాలను, ఎదుర్కొన్న అవరోధాలను, విధానాలను పంచుకున్నారు. ఈ కోవలో ఆంధ్ర రాష్ట్రం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాలలో గత 15 ఏళ్లుగా క్రై సంస్థ సహకారంతో పోర్డు సంస్థ సారథ్యంలో బాలల హక్కులు, బాలికలు, మహిళల సాధికారతపై అలుపెరగని సేవలందించిన రెడ్డమ్మ, అనితలకు ప్రతిభ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు అందజేశారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఈ అవార్డులు రావడానికి పోర్టు సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ, కన్వీనర్ ఆవుల నరసింహులు, క్రై సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్, జనరల్ మేనేజర్ పీటర్ సునీల్, ప్రోగ్రాం ఆఫీసర్లు చెన్నయ్య, రమేష్, మున్నాలకు కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News