నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 02 : మదనపల్లి మండలం లో వర్షాకాలంలో చెరువులను నింపేందుకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారుల చొరవ తో బసినికొండకు చెందిన తెదేపా నేత కత్తి లక్ష్మన్న సొంత నిధులతో రెండున్నర కిలోమీటర్లు పొడవు గల సప్లై ఛానల్ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష భూమి పూజ చేశారు హంద్రీ - నీవా కాలవ సమీపంలోని సద్దలచెరువు, రెడ్డి చెరువు, వడ్డీ చెరువు, తాటి చెరువు, బుచ్చమ్మ చెరువు, పాముల చెరువు మీదగా పెద్ద చెరువు వరకు సప్లై ఛానల్ పూడిక తీత పనులను దాత లక్ష్మన్న జెసిబి తో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా కత్తి లక్ష్మన్నను శాలవతో సత్కరించి , అభినందించారు, దాతలు ముందుకు వచ్చి చెరువు సప్లై ఛానల్ బాగు చేసుకునేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మస్రోర్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఏపీఎం, తెలుగుదేశం నాయకులు విజ్జి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News