నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : రామసముద్రం మండలంలోని ప్రతి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ లో విలేకురలతో మాట్లాడుతూ మండలంలో అక్కడక్కడా విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ లు డ్యామేజి చేసి కాపర్ వైరు దొంగతనాలు జరిగినట్లు మాదృష్టికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో మందుకు బానిసలైనవారు, చిన్న చిన్న పనులు పేరుతో పొలాలు, బోరు మోటార్లు దగ్గర కనిపిస్తే ఎందుకు వచ్చారు అని అడగాలని. ట్రాన్స్ ఫార్మర్లు, బోరు వద్ద గల షెడ్డు, రూముల వద్ద అవసరం లేని వ్యక్తులను అనుమతించరాదన్నారు. ప్రతి రోజు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంపుసెట్ లను పరశీలించాలన్నారు. రాత్రి సమయాల్లో బయట వ్యక్తులు గుర్తు తెలియని వాహనాలు పొలాలు వద్ద లేదా గ్రామాలు బయట సందేహాస్పదంగా ఆగి ఉన్నా వెంటనే గ్రామల్లో పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పొలాలు వద్ద వెలుగులు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంపు షెట్లు వద్ద గట్టి భద్రత కలిగిన బలమైన తాళాలు వినియోగించు కోవాలన్నారు. పొలాలు వద్ద విలువైన, డ్రిప్ పరికరాలు, రైతులకు సంబందించిన పనిముట్లు,ఎరువులు ఆస్తి విలువ ఎక్కువగా ఉంటే రైతులు సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో, ఆన్ లైన్లో కూడ తక్కువ ధరల్లో మంచి నాణ్యతతో సి సి కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, కెమెరాలు మొబైల్ కనెక్ట్ అవడం వల్ల మనం ఎక్కడున్నా పర్యవేక్షణ సులభం అవుతుందన్నారు. రాత్రి పూట పోలీస్ సిబ్బంది ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసామని పొలాలు వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మార్ల వద్ద నిఘా కొనసాగుతుందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చిన మా పోలీసులు ముందుంటామన్నారు. రైతులకు సంబందించిన వస్తువులను దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో యస్.ఐ. రమేష్ బాబు, ఏ.ఎస్.ఐ హిమచలపతి, లోకేష్, గంగిరెడ్డి, భరత్ రెడ్డి కప్యూటర్ ఆపరేటర్ జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News