Wednesday, 16 September 2026 12:53:11 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి

Date : 08 July 2026 04:09 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్, అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, పట్టణంలోని అన్ని కాలనీలకు అవసరమైన మేర నీటిని సమీప జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా తరలించి ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీటీఎం రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువను సర్వే చేసి, అవసరమైన సాంకేతిక చర్యలు పూర్తి చేసిన అనంతరం రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా సంబంధిత బీఎల్‌ఓలకు అవసరమైన సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: