Tuesday, 15 September 2026 08:51:36 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మిట్స్ లో ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్

Date : 21 May 2026 07:42 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మే 21 : మదనపల్లి పట్టణం సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగాల ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరుకు చెందిన హెచ్‌సీఎల్ గువి సంస్థ, డైరెక్టర్ లక్ష్మణన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హెచ్‌సీఎల్ గువి సంస్థ వారి ఆధ్వర్యంలో హెచ్‌సీఎల్ గువి ట్రైనర్లు విద్యార్థులకు జావా మరియు పైథాన్ ప్రోగ్రామింగ్ భాషలపై నెల రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు జావా, పైథాన్ ఆధారిత ప్రోగ్రామింగ్ టాస్కులు, కోడింగ్ సమస్యలు మరియు రియల్ టైమ్ అప్లికేషన్ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్ కార్యకలాపాలను అప్పగించి వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచారని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి పలు ఆధునిక సాంకేతిక రంగాలలో రూపొందించిన సమస్యలకు విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అందించారని తెలిపారు. మొత్తం 30 బృందాలు పాల్గొన్న ఈ హ్యాకథాన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి 10,000/-, రెండవ బహుమతి 5,000 /- మరియు మూడవ బహుమతిగా 3,000/- నగదు మరియు సర్టిఫికెట్స్ ను విద్యార్థులకు అందజేశారు. విద్యా జ్ఞానం మరియు పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో సహాయసహకారాలు అందించిన మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పనా, డాక్టర్ ఎస్.పద్మ, డాక్టర్ చొక్కనాథన్, కోఆర్డినేటర్స్ శాయీజ్ అహమ్మద్, ఉష, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: