Saturday, 12 September 2026 12:08:45 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాల మోత మోగించిన అన్నమయ్య జిల్లా పోలీసులు

7 స్వర్ణం , 08 రజత, 06 కాంస్యం, మొత్తం 21పథకాలు కైవసం

Date : 08 September 2026 04:27 PM Views : 41

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 09 : రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 4 వరకు జరిగిన '1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026' పోటీల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కర్నూలు రేంజ్ తరపున ప్రాతినిధ్యం వహించిన అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సత్తా చాటి మొత్తం 21 పతకాలను కొల్లగొట్టారు. ఈ ఘన విజయం సాధించిన క్రీడాకారుల బృందం మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజేతలను ఎస్పీ గారు స్వయంగా అభినందించి, పతకాలతో ఘనంగా సత్కరించారు

అన్నమయ్య జిల్లా సాధించిన పతకాల వివరాలు : *ఎస్పీ గారి స్ఫూర్తిదాయక విజయం:* జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు స్వయంగా టెన్నిస్ డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరును ప్రదర్శించి రన్నరప్‌గా నిలిచి సిల్వర్ మెడల్ (రజతం) సాధించి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. *మహిళా విభాగం పతకాలు (WPC పి. శశికళ అద్వితీయ ప్రదర్శన - 7 పతకాలు):* స్వర్ణం 2: బాక్సింగ్, హ్యాండ్ రెజ్లింగ్. రజతం 2: షటిల్, బాస్కెట్ బాల్ కాంస్యం 3: హ్యాండ్ బాల్, కబడ్డీ, రెజ్లింగ్. *పురుషుల వ్యక్తిగత విభాగం పతకాలు:* CPC బి. కేశవ: ఆర్మ్ రెజ్లింగ్ - స్వర్ణం. CPC ఎం. నాగేంద్ర నాయక్: షాట్ పుట్ - రజతం, జావెలెన్ త్రో - రజతం. CPC సి. జగదీష్: రెజ్లింగ్ - రజతం, గ్రీకో రోమన్ - కాంస్యం. ARPC ఇ. శ్రీను నాయక్: హై జంప్ - కాంస్యం. ARPC కె. సంతోష్: డిస్కస్ త్రో - కాంస్యం. *టీమ్ గేమ్స్ పతకాలు:* హ్యాండ్ బాల్ (స్వర్ణం): PC బి. శివకుమార్, PC మోహన్ రావు, PC పి. మనోహర్, PC సి. శ్రీనివాసులు. హాకీ (రజతం): CI చాంద్ బాషా, SI రహీమ్, HC అమర నారాయణ. ఫుట్‌బాల్ (రజతం): ARPC శివ సుబ్రహ్మణ్యం. మొత్తం పతకాలు 21 స్వర్ణ పతకాలు (Gold): 7 రజత పతకాలు (Silver): 8 కాంస్య పతకాలు (Bronze): 6

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. "పోలీస్ వృత్తి నిరంతర ఒత్తిడితో కూడుకున్నది. క్రీడల ద్వారా ఆ ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించవచ్చు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలి. క్రీడలు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని అందిస్తాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో 21 పతకాలు సాధించడం అన్నమయ్య జిల్లాకు గర్వకారణం. భవిష్యత్తులో కూడా క్రీడల్లో రాణించే ప్రతిభావంతులను జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రోత్సహిస్తాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో పతకాలు సాధించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :