Thursday, 30 July 2026 12:27:24 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ యన్.సి.సి. యూనిట్ ఆఫీసర్ కు క్యాప్టెన్ గా పదోన్నతి

Date : 17 November 2025 07:36 AM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 16: అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యెన్.సి.సి విభాగానికి అసోసియేట్ యెన్.సి.సి ఆఫీసర్ గా సేవలు అందిస్తున్న యెన్.నవీన్‌కుమార్ కు లెఫ్టినెంట్ హోదా నుండి కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని, కాంప్టీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఆఫీసర్స్‌ ట్రైనింగ్ అకాడమీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, సంబంధిత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పదోన్నతి లభించిందని తెలిపారు. యెన్.సి.సి కార్యక్రమాల అభివృద్ధి, శిక్షణా ప్రమాణాల మెరుగుదల, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్యాంపుల్లో కేడెట్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ప్రశంసిస్తూ కల్నల్ ఎన్.వి మోనిష్, కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కల్నల్ పి.లోగనాథన్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది, 35-ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారి చేతులమీదుగా పదోన్నతి పత్రాలను అందుకున్నారు. కెప్టెన్ గా పదోన్నతి పొందిన యెన్.సి.సి ఆఫీసర్ నవీన్ కుమార్ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :