Thursday, 30 July 2026 03:35:36 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు గ్రహణం...!

Date : 18 January 2026 10:54 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 18 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు టిడిపి నాయకులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి విగ్రహం ఏర్పాటుకు దిమ్మె సైతం నిర్మించారు. ఆదివారం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతులు లేవని పోలీసులు టిడిపి నాయకులకు సమాచారం అందించారు. ఈ విషయమై మండలంలోని టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఎస్సై అనిల్ కుమార్ ను కోరారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామపంచాయతీ, రెవిన్యూ, ఆర్ అండ్ బి అధికారుల అనుమతి పత్రాలు ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ నాయకులకు సూచించారు. టిడిపి నాయకులు తమకు విగ్రహం ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారని తమ వాదనలు వినిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సంతోషంగా నిర్మాణ పనులు ముమ్మరం చేయగా నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడడంతో టిడిపి నాయకులు సందిగ్ధంలో పడ్డారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఇప్పటికే నాయకత్వ లోపంతో తమ పనులు జరగలేదని పలుమార్లు పార్టీ పెద్దలకు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. అయితే అధికారంలో ఉండి కూడా సాక్షాత్తు టిడిపి వ్యవస్థాపకుని విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇన్ని అడ్డంకులా అని టిడిపి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :