Wednesday, 29 July 2026 05:26:15 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లె అల్లనేరేడు పండ్ల ( జామున్ ఫ్రూట్ ) కు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు

Date : 15 February 2026 05:14 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 15 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు మదనపల్లె జామున్ ఫ్రూట్ (అల్లనేరేడు పండ్ల) కు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించినట్లు వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీలోని మిట్స్ ఇంటెలెక్టుల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో ఈ దరఖాస్తు పూర్తి చేయబడిందని ఆయన వెల్లడించారు. మదనపల్లె అల్లనేరేడు పండ్లకు గాఢ ఊదా రంగు, సమతుల్యమైన తీపి-పులుపు రుచి, అధిక పోషక విలువలు, ఔషధ గుణాలు మరియు ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ప్రత్యేక గుర్తింపునిస్తాయని, ఇవి మదనపల్లె ప్రాంతంలోని ప్రత్యేక వ్యవసాయ-వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. అల్ల నేరేడు పోషకాల గని అని, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి అని, నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు ఆయన అన్నారు. అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది అని, ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అని అన్నారు. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి అని, అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి అని అన్నారు. అంతే కాకుండా అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది అని, ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని, అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది అని అన్నారు. కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి అని అన్నారు. చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ లోని ఐపిఆర్ కార్యాలయానికి జి ఐ దరఖాస్తును సమర్పించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తు ద్వారా మదనపల్లె అల్లనేరేడు పండ్లను మదనపల్లె భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా సంబంధించిన విలక్షణమైన వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జి ఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చేయడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మదనపల్లె అల్లనేరేడు పండ్ల విలువను పెంచడం సాధ్యమవుతుందని వివరించారు. ఈ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన శ్రీ భూదేవి జామున్ (అల్లనేరేడు పండ్ల) సొసైటీ , మిట్స్-ఐపిఎఫ్‌సి మరియు మిట్స్ ఆర్ & డి సెల్ సభ్యుల కృషిని యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకనాథ్ అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ - రీసెర్చ్ & ఇన్నోవేషన్-డాక్టర్ రవీంద్రనాథ్ చెరుకూరి, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: