Sunday, 13 September 2026 07:59:54 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

Date : 14 April 2026 06:42 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి మదనపల్లె : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఎంప్లాయిస్ యూనియన్ వన్ టు డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),వన్ డిపో మేనేజర్ రమణారెడ్డిలు పేర్కొన్నారు.మంగళవారం ఆర్టీసీ టూ డిపో ఆవరణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆర్టీసీ కార్మికుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఇందులో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్,నాగూర్ వలిలు మాట్లాడుతూ చదువుకోవడానికి అవకాశాలు లేకున్నప్పటికీ చిన్నతనం నుండే పట్టుదలతో చదివి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారన్నారు.విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చిన అనంతరం తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విశేష సేవలు అందించారని కొనియాడారు.అంటరానితనం,కుల వ్యవస్థను నిర్మూలించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అన్నారు.ముసాయిదా కమిటీ చైర్మనుగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారన్నారు.ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బిఎ నాయక్,సిఎ బాబు నరసింహులు,శివ,యం.కె.నాయక్,ఈశ్వరప్ప,సీతారామ్,హుస్సేన్,ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :