నమిత న్యూస్ - Andhra Pradesh / Sir Balji Dist : తిరుపతి - ఆగస్ట్ 15 : తిరుపతి జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో కలకలం. జెండా పండుగకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వేదికపై తన ప్రసంగం చదువుతున్న సమయంలోనే ఆయన ఉన్నట్లు ఉండి చదువుతూ చదువుతూ ఒక్కసారిగా ఆయన తూలిపోయారు వెనక్కి పడబోతుండగా పక్కనే ఉన్న కలెక్టర్, సెక్యూరిటీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. ఆ వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలంటూ సిబ్బందిని ఆదేశించగా నిమిషాల్లోనే స్పాట్ కు చేరుకున్న డాక్టర్లు ఆయన్ను పరీక్షించారు. బీపీ డౌన్ కావటం వల్లే అలా జరిగిందని కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు డాక్టర్లు. ప్రస్తుతం బీపీ నార్మల్ గా ఉందని వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది, అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పినట్ల అయ్యింది. మంత్రి మంత్రికి ఇలా జరగడం తో అధికారులు, వేడుకకు హాజరైన ప్రజలు అందరూ కంగారుతో ఆందోళన చెందారు
Reporter
Namitha News