Tuesday, 15 September 2026 09:38:10 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 17 January 2026 10:05 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 17: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. పి.టి.యం మండలం కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిత తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా సచివాలయం లోని హాజరు పట్టిక, వి.ఆర్.ఓ కి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. సచివాలయంలోని విఆర్ఓ, సర్వేయర్ లతో జిల్లా కలెక్టర్... గ్రామంలో రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. దారి సమస్యలు, రీ సర్వే, మ్యుటేషన్ లు, తదితర రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు అన్ని గ్రామ సచివాలయం లోనే పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని, ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం మరియు జిల్లా అధికారుల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు గ్రామ స్థాయి లోనే ప్రజా పరిష్కారాల వేదిక నందు వారి సమస్యలను పరిష్కరించాలని, జిల్లా సచివాలయం నుండి అందుతున్న అర్జీల పై వెంటనే స్పందించి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించే దిశగా పని చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడుతూ.... గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందా లేదా, మూడు నెలలకు ఒకసారి పంచాయతీ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరించే సమయంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించి చెత్తను ప్రతి రోజు సేకరించాలని తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటించాలని గ్రామానికి సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకు ప్రతి మూడు నెలలకి ఒక సారి శుభ్రపరచి ప్రజలకు మంచి నీరు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఏర్పాటుచేసిన ప్రభుత్వ సేవలు అన్నిటిని ప్రజలకు సులభతరంగా అందజేయాలన్నారు. దీనితోపాటు రైతులకు తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయంనకు అవసరమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించే విషయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పాత్ర కీలకమన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ఉదయం మరియు సాయంత్రం ఫేస్ అటెండెన్స్ కచ్చితంగా వేయాలని ఆదేశించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :