Monday, 14 September 2026 08:29:14 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మోకాలి జబ్బులను తక్షణమే గుర్తించే స్మార్ట్ ఆధార పరికరాన్ని అభివృద్ధి చేసిన మిట్స్ విద్యార్థులు

Date : 09 June 2026 09:05 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 09 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) నాలుగో సంవత్సరం విద్యార్థులు వినూత్న ఆలోచనతో “స్మార్ట్ నీ బ్రేస్ ఫర్ ఇన్‌స్టంట్ ఇంజరీ డిటెక్షన్” అనే ఆధునిక ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విద్యార్థులు సి. నందిని, కె. నందిని మరియు కె. నందిని లు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, పర్యవేక్షణలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత ధరించగలిగే స్మార్ట్ పరికరాన్ని రూపొందించారు. మోకాలి గాయాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ స్మార్ట్ బ్రేస్‌ అధునాతన పరికరం లో అమర్చిన మాయిశ్చర్ సెన్సర్ ద్వారా మోకాలిలో ఏర్పడే వాపు మరియు మోకాలి గుజ్జు పేరుకుపోయిన పరిస్థితులను గుర్తించవచ్చు. అలాగే జైరోస్కోప్ సెన్సర్ ను మోకాలి కదలికలను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించమని వారు అన్నారు. ఈ వివరాలను ఆర్డినో మైక్రోకంట్రోలర్ విశ్లేషించి ఏవైనా అసాధారణ మార్పులు గుర్తించిన వెంటనే బజర్ ద్వారా హెచ్చరికను అందించడంతో పాటు ఎల్‌సీడీ డిస్‌ప్లేపై సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నోడ్‌ఎంసీయూ వై-ఫై మాడ్యూల్ సహాయంతో సేకరించిన సమాచారాన్ని క్లౌడ్‌కు పంపించి, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు మరియు వారి సంరక్షకులకు తక్షణ సమాచారం చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారని విద్యార్థులు తెలిపారు. మోకాలి గాయాలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సహాయం పొందేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులు, వృద్ధులు మరియు పునరావాస చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారంగా తీర్చిదిద్దనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వినూత్న ఆలోచనను అభినందించిన ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ గౌరె, ఇటువంటి పరిశోధనాత్మక ప్రాజెక్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: