Sunday, 13 September 2026 03:55:55 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

సుస్థిర ఆవిష్కరణ & సహకార డెవోప్స్ పై అతిధి ఉపన్యాసం

న్యూ ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాసం

Date : 15 November 2025 08:07 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 15 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగము వారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సుస్థిర ఆవిష్కరణ మరియు సహకార దేవోప్స్ సంస్కృతి మరియు పద్ధతులు అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్య పళనిసామి, ఐ.టి కన్సల్టెంట్, NTT డేటా పేమెంట్ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్య పళనిసామి మాట్లాడుతూ డేవ్ ఆప్స్ అనేది సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మరియు ఐటి ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు, ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డెవ్‌ఆప్స్ పద్ధతులు సంస్థల ఎదుగుదలకు, మార్పులకు అనుగుణంగా మారడం చాలా అవసరమని అన్నారు. బృందాల మధ్య సహకారాన్ని పెంపొందించి , ప్రక్రియలను క్రమబద్దీకరిస్తూ సుస్థిరమైన ఆవిష్కరణలకు దారితీస్తాయని అన్నారు. డెవ్‌ఆప్స్ టూల్స్, టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్‌ల వరకు, పోటీతత్వాన్ని పొందేందుకు డేవ్ ఆప్స్ ను స్వీకరించాయి అని, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మరియు పేస్ బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్ డెలివరీ పైప్‌లైన్‌లను డేవ్ ఆప్స్ ప్రాక్టీస్‌ల చుట్టూ నిర్మించాయి అన్నారు. CI/CD పైప్‌లైన్‌ల అమలు, మరియు బలమైన డెవ్‌ఆప్స్ సంస్కృతిని నిర్మించడం వంటి అంశాలు విద్యార్థులకు పరిశ్రమల యొక్క తాజా పోకడలు, సాంకేతికతలపై అవగాహన కల్పిస్తాయని, వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ, కోఆర్డినేటర్స్ కె.పుగజరాసి, డాక్టర్ కె.నిర్మల దేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :