Thursday, 16 April 2026 06:52:29 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కరాటేలో విజయభారతి విద్యార్థుల విజయదుందుభి

ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం - అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు

Date : 24 November 2025 07:40 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కరాటేలో విజయభారతి విద్యార్థుల విజయదుందుభి - ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం - అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మదనపల్లె : ప్రతిభతోపాటు పతకాలు సాధించినప్పుడే కరాటే విద్యార్థులకు తగిన గుర్తింపు వస్తుందని విజయభారతి స్కూల్ చైర్మన్ డాక్టర్ యన్.సేతు పేర్కొన్నారు.కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరిగిన ఒకినవా గోజు రియు కరాటే డూ ఫెడరేషన్ మలేషియా వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ - 2025 పోటీలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.యస్.కే గోజు రియు కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి యమ్ కన్నన్ పాల్గొన్నారు.ఇందులో మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు.ఈ సందర్భంగా కరాటే మాస్టర్ యం.మణిసాయి మాట్లాడుతూ ఛాంపియన్షిప్ నందు 13 సంవత్సరాల సీనియర్ బాయ్స్ కటా విభాగంలో కే.చరణ్ తేజ,సి.గౌతమ్ నంద,వై.గీర్వన్,అర్.ధనుష్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు.ఆదేవిధంగా 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.కార్తికేయ ప్రథమ స్థానం,10 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో కే.యస్వంత్ తేజ్ ప్రథమ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యస్.మహేశ్వర్ ప్రథమ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.కార్తికేయ ప్రథమ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వి.రేవంత్ ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి.చందన్ ద్వీతీయ స్థానం 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.గగన్ ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి.హేమంత్ ద్వీతీయ స్థానం,11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.హరీష్ రెడ్డి ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.రిషికేష్ గౌడ్ తృతీయ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జి. ప్రేమ్ సందీప్ తృతీయ స్థానం,11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.జఫ్ఫార్ తృతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జె. రోహిత్ తృతీయ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వరుణ్ తెజ్ తృతీయ స్థానం అందుకున్నరు.విద్యార్థులకు యస్.యస్.కే గోజు రియు కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి యమ్ కన్నన్ చేతుల మీదుగా బహుమతులు,ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ స్వర్గీయ డాక్టర్ ఎఆర్.సురేష్ శిక్షణ మరియు ఆశీస్సులతో మాకు సాధ్యమయిందని యూత్ కరాటే క్లబ్ ప్రెసిడెంట్ రెన్షి యం.మణిసాయి పేర్కొన్నారు.ఈ సందర్భంగా విజయ భారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్య విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు.కరాటే మాస్టర్ మణిసాయి శిక్షణలో తమ విద్యార్థులు రాణించడం శుభపరిణామన్నారు.ఇదే స్ఫూర్తితో రాష్ట్ర,జాతీయస్థాయి కరాటే పోటీలలో విద్యార్థులు రాణించి మదనపల్లి కీర్తిప్రతిష్టలు పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :