Saturday, 12 September 2026 05:34:50 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మదనపల్లి అభివృద్ధికి ఎక్కడికైనా చర్చ కు సిద్ధం - ఎమ్మెల్యే షాజహాన్

టౌన్ బ్యాంక్ అవినీతిపై సీబీఐ, సీఐడీ విచారణకైనా సిద్ధం - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 24 June 2026 05:00 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ​కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం... ​గత ఐదేళ్ల అరాచకాలకు చెక్.. మదనపల్లి రూపురేఖలు మారుస్తాం. ​టౌన్ బ్యాంక్ అవినీతిపై సీబీఐ, సీఐడీ విచారణకైనా సిద్ధం..మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలు, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టారు. ​ మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల్లో ఉండే ప్రభుత్వం.. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఒకప్పుడు మదనపల్లి టౌన్ లో వర్షం పడితే రోడ్లు ఈతకొట్టేలా ఉండేవి. కానీ,ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 59 అభివృద్ధి పనులకు భూమిపూజ చేశాం. మదనపల్లి చుట్టూ రింగ్ రోడ్ బైపాస్ కోసం 470 కోట్ల రూపాయల అంచనాలతో డీపీఆర్ (DPR) సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. ​గత పాలకులు కేవలం భూకబ్జాలకు పాల్పడ్డారు. సీటీఎం చెరువులను కూడా వదలకుండా ఆక్రమించారు. పేదల డికెటి భూములను లాక్కున్నారు. కానీ, మా హయాంలో అక్రమాలకు తావులేదు. రోడ్డు వెడల్పులో భాగంగా 22 చెట్లు తొలగిస్తే.. దానికి బదులుగా 1000 చెట్లను నాటాం.రాబోయే రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా మా కూటమి నాయకులతో కలసి 10,000 చెట్లు నాటడమే మా లక్ష్యం. మదనపల్లి టౌన్ బ్యాంక్ వ్యవహారంలో జరిగిన అవినీతిపై ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. సీఐడీ (CID) లేదా సీబీఐ (CBI).. ఏ విచారణ జరిపించినా పూర్తి బాధ్యతతో సహకరిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా, నిరుద్యోగుల కోసం 16,347 ఉద్యోగాలతో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ఇచ్చి, ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ​ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.తెల్లవారుజామున 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మెడికల్ కాలేజీ నిర్మాణంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగంపై కూడా అసెంబ్లీ సాక్షిగా గళమెత్తాం. మదనపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే మా ఏకైక లక్ష్యం" అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధీమా వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :