నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 09 : మారుమూల వెనుకబడిన గ్రామాలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో ఐ సి టి సి కౌన్సిలర్ చంద్రమోహన్ సారధ్యంలో ఎంపీడీవో ఉషారాణి వాహన ఎల్ఈడి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. సిహెచ్సిలో ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ అమర సింహరాజు వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రెడ్డి నరేష్, సతీస్ సిస్టర్ గ్లోరీ, ఏవో థామస్ రాజా, దిశ, ఐ సి టి సి,కృషి సంస్థల ప్రతినిధులు ఓ ఆర్ డబ్ల్యు పల్లవి, నాగవేణి, సీసీ నరసింహులు కత్తి, రమణ,అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ వాహనం గిరిజన తండాలు, హై రిస్క్ ఏరియాలో హెచ్ఐవి పరీక్షలతో పాటు హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ప్రధాన కూడలి ప్రాంతాలలో కరపత్రాలు పంచిపెట్టారు
Reporter
Namitha News