నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 14 : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు తంబళ్లపల్లి మండలంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు అర్హులైన అక్కడమిక్ ఇన్స్పెక్టర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ త్యాగరాజు ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఇన్స్పెక్టర్లు ఈనెల 16వ తేదీ నుండి 21వ తేదీ లోపు సంబంధిత విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 30-04-2027 తేదీ వరకు 8 నెలలు కాలానికి తాత్కాలికంగా నియామకం జరుగుతుందన్నారు. ఎంపికైనy స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థికి నెలకు12,500, సెకండరీ గ్రేడ్ అభ్యర్థికి 10,000, గౌరవ వేతనం చెల్లించబడుతుందని అర్హులైన అభ్యర్థులు సకాలంలో దరఖాస్తులు పంపుకోవాలని ఎంఈఓ త్యాగరాజు కోరారు
Reporter
Namitha News