Saturday, 12 September 2026 12:08:15 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రైతులకు నాణ్యమైన ఎరువులు,మేలిరకం విత్తనాలు అందించాలి - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సూచనలు - అట్టహాసంగా పద్మ ట్రేడర్స్ ప్రారంభోత్సవ

Date : 07 September 2026 08:06 PM Views : 41

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు నాణ్యమైన ఎరువులు,మేలిరకం విత్తనాలు అందించాలి - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సూచనలు - అట్టహాసంగా పద్మ ట్రేడర్స్ ప్రారంభోత్సవం మదనపల్లె : నియోజకవర్గంలోని రైతులకు నాణ్యమైన వ్యవసాయ మందులు,విత్తనాలు అందించి పంటల దిగుబడి పెరగడానికి వ్యాపారులు సహకరించాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సూచించారు.సోమవారం మదనపల్లె పట్టణంలోని ఎస్.బి.ఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా పద్మ ట్రేడర్స్ నిర్వహకులు నాగేశ్వరరావు,ప్రభు కుమార్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికారు.ఇందులో భాగంగా శ్రీరామ్ చినబాబు మరియు యాలగిరి దొరస్వామి నాయుడు షాప్‌ను ప్రారంభించి,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,వ్యవసాయ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతన్నకు నష్టం కలిగించే నకిలీ,నాసిరకం మందులకు దూరంగా ఉండాలని,రైతుల నమ్మకాన్ని కాపాడే విధంగా వ్యాపారం నిర్వహించి అందరి మన్ననలు అందుకోవాలన్నారు.అనంతరం పద్మ ట్రేడర్స్ నిర్వాహకులు నాగేశ్వరావు,ప్రభుకుమార్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రసిద్ధిగాంచిన కంపెనీలకు చెందిన పురుగుమందులు,ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.రైతులకు నాణ్యమైన ఎరువులు,విత్తనాలు అందజేస్తామని తద్వారా అధిక దిగుబడులు సాధించి,ఎక్కువ లాభాలు గడించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు,కార్యకర్తలు,వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :