Sunday, 13 September 2026 09:57:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

దాడి లో గాయపడ్డ జనసైనికుడి ని బాధితుడిని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్

Date : 05 July 2026 09:51 AM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : మదనపల్లి మండలం సీటీఎం సోమలగడ్డలో జనసేన కార్యకర్తపై జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీటీఎం సోమలగడ్డకు చెందిన కె. రెడ్డప్ప కుమారుడు, జనసేన కార్యకర్త దిలీప్ కుమార్ శుక్రవారం రాత్రి తన స్నేహితుడు గంగాధర్‌తో మాట్లాడుతుండగా అదే గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన రమణ కుమారుడు రాజు, శ్రీనివాసులు కుమారుడు తేజ, మల్లికార్జున అభి కలిసి బీరు బాటిల్, రాళ్లతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో దిలీప్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్ అర్థరాత్రి సమయంలోనే ఆస్పత్రికి సిబ్బంది తో మాట్లాడారు. శనివారం ఆయన నేరుగా బాధితుడు దిలీప్ కుమార్‌ను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందేలా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా బాధితుడికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అర్థరాత్రి సమయంలో బాధితుడి నుంచి సమాచారం అందగానే వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బంది, పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తాలూకా పోలీసులను కోరినట్లు వెల్లడించారు. యువత మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జంగాల శివరామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువత సంక్షేమం, మాదకద్రవ్యాల నిర్మూలన, సురక్షిత సమాజ నిర్మాణం కోసం పలు కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి యువతను తప్పుదోవ పట్టించే వారిపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత మంచి మార్గంలో నడిచి కుటుంబాలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో సీటీఎం నీటి సంఘాల చైర్మన్ కోసూరి వేమన్న, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :