Monday, 14 September 2026 09:33:56 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు

సిపియం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

Date : 14 April 2026 03:43 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన జరిగినప్పుడే దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులపై సామాజిక వివక్ష తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితేతర క్రైస్తవులు వివాహం చేసుకోకపోవడమే దీనికి నిదర్శనమని, క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ వేళ్లూనుకొని ఉందని విమర్శించారు. సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తున్నట్లే, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా వారు ఎదుర్కొంటున్న దాడులు, వివక్ష కులం ఆధారంగానే జరుగుతున్నాయని గుర్తు చేశారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లు దళిత క్రైస్తవుల స్థితిగతులను అధ్యయనం చేసి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసినా, పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా అత్యున్నత న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు చర్యే అవుతుందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల విముక్తి కోసం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని వర్గ పోరాటంలో' అంతర్భాగం చేయడం ద్వారానే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం, కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రామకృష్ణ, గోపాల్, రాజు, శంకరమ్మ, జయమ్మ, రెడ్డెమ్మ, శ్రీరాములు, రామచంద్ర, కృష్ణప్ప, రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: