నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష మదనపల్లె : సంస్థ విఘ్నాలు తొలగి,తలపెట్టిన ప్రతి పనిలో విజయం,ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో మండపాలను ఏర్పాటు చేసి,గణేశుని పూజిస్తూ సంతోషంగా ప్రశాంతంగా,పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు.కొత్తగా ఏ కార్యం ప్రారంభించినా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తొలిపూజగా వినాయక స్వామిని మొదట ప్రార్థిస్తారు.ఏకాగ్రత,జ్ఞాపకశక్తికి వినాయకుడు ప్రతీకుడని,వినాయకుని పెద్ద తల విశాలమైన ఆలోచనా శక్తికి,పెద్దచెవులు చక్కగా ఆలకించే (వినే) గుణానికి ప్రతీకలు,ఇది విద్యార్థులకు నిత్య స్ఫూర్తినిస్తుందని,విద్యార్థులు చదువులలో చక్కగా రాణించాలని ఆకాంక్షించారు.హిందూ సంప్రదాయంలో వినాయకుడిని బుద్ధి,జ్ఞానం మరియు విద్యలకు అధిపతిగా పూజిస్తారు.ఈ పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News