Monday, 14 September 2026 06:54:11 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రసన్న వెంకటేశ్వరుడిని దర్శించుకొన్న బిజెపి నేత, టి.టి.డి. బోర్డు మెంబర్ భానుప్రకాష్

ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తాం - టి.టి.డి.పాలకమండలి సభ్యులు భానుప్రకాష్

Date : 27 January 2026 09:02 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని కూటమి నాయకులు కోరారు. మంగళవారం టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి ని కోసువారిపల్లి స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు, కూటమి నాయకులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వాములు వెంకటేశ్వర స్వామికి భాను ప్రకాష్ రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి ల పేరుతో ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు 2010 లో టీటీడీ పరమైన ఈ పురాతన ఆలయానికి నూతన కళ్యాణమండపం, పుష్కరిణి, ఆలయంలో ఇద్దరు వేద పండితులు, స్వీపర్లు, వసతి గృహాలు, నూతన తేరు, ఏర్పాటు చేసి తంబళ్లపల్లె మండలంలో ఆలయాల సముదాయం ఉన్నందున పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని కోరారు. టిటిడి ఆలయానికి సంబంధించిన సమస్యలను టిటిడి బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు చేసిన కృషిని కొనియాడారు. వారి వెంట బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :