నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 29 : పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద ఒక వ్యక్తిపై దాడి జరిగిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెంకటప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం 45 పై తన పొలం వద్ద కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని గమనించాడు. ఈ క్రమంలో తన పొలంలో పేకాట ఆడవద్దని వారిని హెచ్చరించగా, వారు ఆగ్రహానికి గురై కట్టెలతో సుబ్రహ్మణ్యంపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన సుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తన పొలం వద్ద అక్రమంగా మద్యం సేవిస్తూ పేకాట నిర్వహిస్తున్న వారిని అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరారు.
Reporter
Namitha News