నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 10 : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 10 నా దేశవ్యాప్త నిరసన, జైలు భరో కార్యక్రమాల్లో. భాగంగా ఏఐటీయూసీ రైతు కూలీల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతి చౌక్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఢిల్లీలో జూలై 28, 29 తేదీల్లో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జాతీయ సదస్సు నేడు కార్మికులు, రైతాంగం, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఆగస్టు 10న జైలరో, నిరసన కార్యక్రమాలను నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించాయి అని. మన రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికై ఆగస్టు 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జైల్ భరోలలో కార్యక్రమం భాగంగా. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు బి కొత్తకోట జ్యోతి చౌక్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బషీర్ ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి, బి కొత్తకోట మండల కార్యదర్శి జి రఘునాథ్ రైతు కూలీల సంఘం నాయకులు నారాయణస్వామి వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి ఉద్యమం ద్వారా మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలని మోడీ పాలనలో నిరుద్యోగం మొన్న పెన్నడు లేనంతగా ప్రజానికంపై నిత్యవసర సరుకుల ధరల పెంపు గ్యాస్ ధరల పెంపు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు. టైడ్ యూనియన్ హక్కులపై దాడి విద్యుతొ సహా ఆర్టీసీ మున్సిపల్ సేవలు ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ స్థలాలను కార్పొరేటర్స్ కు కట్టబెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతున్నది వీటికి తోడు ప్రజలను కులాలు మతాలు వారిగా విడగొడుతున్నారు వీటన్నిటిని మనం ఎదిరించి నిలబడాలి ప్రజలను ఏకంగా నిలబెట్టాలి కార్మికులు రైతులు ప్రజాస్వామ్య శక్తుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి జీవనో పాధులను లోకికతతావా న్ని రక్షించుకోవాలి అన్నారు డిమాండ్లు అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం రద్దు చేయాలి లేబర్ కోడ్ రద్దు చేయాలి అందరికీ కనీస వేతనం రూ 31 వేలు ఇవ్వాలి అంగనవాడి ఆశా మిడ్ డే మీల్స్ తదితర సీన్స్ వర్కర్ కు కనీస వేతనం చెల్లించాలి టైమ్ సేల్ డైలీవేజ్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి భావన నిర్మాణo హమాలీ తదితర అసంఘటితరంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలి ఇన్ క్షేమ పథకాలు అమలు చేయాలి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సమీవుల్లా ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు శంకరా గంగులప్పా గఫూర్ పెద్దరాయుడు సాదిక్ రమేష్ లక్ష్మన్న షౌకత్ షఫీ హరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News