Sunday, 13 September 2026 07:40:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రెడ్డి సాహెబ్

అమ్మవారి కి ప్రత్యేక పూజలు, అన్నదానం

Date : 09 March 2026 09:08 AM Views : 318

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 09 : కోరిన కోర్కెలు తీర్చే శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు. ‌​మదనపల్లె పట్టణం సిటిఎం రోడ్డు శీవాజీ నగర్ వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా, పూజలు,, జపాలు, హోమం నిర్వహించారు. ‌ఆలయ కమిటీ సభ్యులు, శివాజీ నగర్, చీకలగుట్ట ప్రజల ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ‌​ముందుగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డీ సాహెబ్ ను ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వేదపండితులు ఆశీర్వదించి, తీర్ధప్రసాదాలు అందజేసినారు. ఆలయ నిర్మాణంలో రెడ్డీ సాహెబ్ ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం మరువలేనిదని వారు కొనియాడారు. ‌ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ భక్తుల నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా శ్రీ పోలేరమ్మ తల్లి నిలుస్తుందని, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ‌ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ‌ అధ్యక్షులు మహబూబ్ పీర్, శరత్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ద్వారకనాథ్ రెడ్డి, ఎస్‌కే రెడ్డప్ప, ఇస్మాయిల్ గంగరాజు, గురు భాస్కర్, అశోక, నాగరాజు వెంకటేష్ తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ‌

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :